సోమల మండలంలోని ఆవులపల్లి పంచాయతీ పట్రపల్లి సమీపంలో మనగలవారం సాయంత్రం ముగ్గురాళ్ల వంక వద్ద ఆవుపై చిరుత పులి దాడి చేసింది. ఆవు అరుపులు విన్న రైతులు గట్టిగా అరవడంతో చిరుత పులి పారిపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు, ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.