పుంగనూరు: జ్వర బాధితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వర బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం స్థానిక ఆసుపత్రిలో మాట్లాడుతూ వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఆసుపత్రికి వచ్చే వారిలో జ్వర పీడితుల సంఖ్య పెరిగిందన్నారు. జ్వరంతో వచ్చే వారికి మలేరియా, డెంగీ పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నట్లు చెప్పారు.