కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎస్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ఈవో వాణి గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. సెప్టెంబర్ 7 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ముఖ్యులకు కాణిపాకం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు.