ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ఈవో వాణి గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. సెప్టెంబర్ 7 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ముఖ్యులకు కాణిపాకం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు.