వివాహమైన 8 నెలలకే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ KPHBలో జరిగింది. MBNR జిల్లాకు చెందిన సుప్రియారెడ్డి(26)ని అదే జిల్లాకు చెందిన రాఘవేందర్‌రెడ్డికి ఇచ్చి మార్చి 24న వివాహం చేశారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాగా కేపీహెచ్‌బీ శంషీగూడలో ఉంటున్నారు. పెళ్లైన నెల నుంచే రాఘవేందర్ భార్యను వేధించసాగాడు. దీంతో మనస్తాపం చెందిన సుప్రియ గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. కూతురి మృతిపై అనుమానం ఉన్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.