పుత్తూరు: క్యాట్ పరీక్షలో శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి
పుత్తూరు మండలంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక క్యాట్ ఒలంపియాడ్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. గణిత శాస్త్రంలో 17, భౌతిక శాస్త్రంలో 35, రసాయన శాస్త్రంలో 30 మంది మొత్తం 82 మంది విద్యార్థులు లెవెల్-2 కి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపి తెలిపారు. ఈ సందర్భంగా, విద్యార్థులను కొనియాడుతూ పోటీ పరీక్షల్లో చైతన్య పాఠశాల మేటిగా నిలిచిందని పేర్కొన్నారు.