సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీలపూడిలో వెలసి ఉన్న శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూజారులు జలకంఠేశ్వర స్వామికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని చందనంతో ముస్తాబు చేసి సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు.