వరదయ్యపాలెంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి
సత్యవేడు జిల్లా వరదయ్యపాలెంలో కొలువైన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగింది. ఆలయం భక్త జనసందోహంతో కిక్కిరిసింది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్య దర్శి శ్రీరామనేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయప్రాంగణం మొత్తం చేపట్టిన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాదిమంది భక్తులకు లడ్డూ ప్రసాదాలను అందజేశారు.