సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం వడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ భూమి నీలాదేవి సమేత శ్రీనివాస ఆలయ మహా సంప్రోక్షణ కుంభాభిషేక ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, వైయస్సార్ సమన్వయకర్త నూక తోటి రాజేష్ ఆలయానికి విచ్చేశారు. ఆలయ అర్చకులు శంకరాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు పలికి దీవించారు.