పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.