Oct 28, 2024, 08:10 IST/
సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్!
Oct 28, 2024, 08:10 IST
భువనగిరి సబ్ జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఈనెల 22న రిమాండ్‌లో ఉన్న ఖైదీని జైలు సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ తరుణంలోనే పోలీసుల కళ్లు కప్పి ఆ ఖైదీ అక్కడి నుంచి సైలెంట్‌గా పరార్ అయ్యాడు. అనంతరం పోలీసులు.. రిమాండ్ ఖైదీని తిరిగి పట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా భువనగిరి సబ్ జైలుకు తరలించారు.