వరదయ్యపాలెం: హత్య కేసులో ముద్దాయి అరెస్ట్
వరదయ్యపాలెం మండలం శ్రీసిటీలో ఇటీవల జరిగిన హత్య కేసులో జార్ఖండ్ కు చెందిన ముద్దాయి విక్రమ్ ముర్ము (24)ను అరెస్టు చేసినట్లు శ్రీసిటీ సీఐ శ్రీనివాసులు, డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. తన తల్లిపై అసభ్యకరంగా మాట్లాడినందువల్ల తాగిన మత్తులో దాడి చేసినట్లు చెప్పారు. దీంతో విక్రమ్ ముర్ము చిన్నాయన షికారి ముర్ము చనిపోయినట్లు చెప్పారు. అతన్ని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.