వరదయ్యపాలెం మండల కేంద్రం నుంచి సంతవేలూరు మీదుగా సూళ్లూరుపేటకు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతవేలూరు మీదుగా సూళ్లూరుపేట వరకు బస్సు లేకపోవడంతో ఆ మార్గంలోని విద్యార్థులు, ప్రజలు అవస్థలు పడ్డారని తెలిపారు. ప్రజలు ఈ బస్సు సర్వీసును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.