శ్రీకాళహస్తి: పటేల్ జాతీయ సమైక్యతకు కృషి చేశారు
ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా బుధవారం జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దేశాన్ని ఒక తాటిపై నడిపించి, జాతీయ సమైక్యతకు కృషి చేసిన పటేల్‌ను భారత జాతి మరువదని కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నంద్యాల వెంకట సుబ్బమ్మ కొనియాడారు. మన దేశంలోకి ఎన్నో సంస్థానాలను విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.