ఎన్నికల ప్రచారంలో తమకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు మరిచిపోయారని, గజినీలాగా వ్యవహరిస్తున్నారని వాలంటీర్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జీతాలు చెల్లించలేదన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. తాము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.