రాత్రి పూట మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి పూట హెవీగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. చీజ్ బర్గర్, ఫ్రైస్, ఫ్రై ఐటమ్స్, మాంసాహారం, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినకూడదు. అలాగే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, సోడాలు, కొన్ని ఐస్ క్రీమ్‌లు, డిజర్ట్‌లలో కెఫిన్ ఉంటుంది. వీటిని తింటే నిద్రకు భంగం కలుగుతుంది.