ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తాము అర్హులమా? కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
- రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి.
- కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.
- భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులే.
- రాయితీ కోసం ఈ కేవైసీ పూర్తి చేయాలి.
- సమస్యలుంటే 1967 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు.