కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ``ఎంత కేంద్ర మంత్రి అయినా.. ఒక ఎంపీనే అన్న విషయాన్ని ఆయన గుర్తుంచు కోవాలి`` అని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసేందుకు సమయం కేటాయించలేక పోతే ఎలా? అని అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు వచ్చాయి. అయితే సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించిన సందర్బంలో ఎంపీ గైర్హజరు కావడంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.