నిఖిల్-సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఓ క్రైమ్ థ్రిల్లర్ కథకి ప్రేమకథని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అలాగని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే అనుభూతిని ఇది ఏ కోశానా ఇవ్వదు. తలా తోకా లేని ఈ కథలో బోలెడన్ని మలుపులు, ఫ్లాష్ బ్యాక్లు మాత్రం ఉంటాయి. అవేవీ ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించవు. కరోనా సమయంలో తీసిన చిత్రమిది కావడంతో అప్పుడెప్పుడో రావాల్సిన సినిమా ఇదని ప్రేక్షకుల అభిప్రాయం.