కర్ణాటక రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలోని బంగార్పేట్లో ఓ రెండంతస్తుల నివాస భవనంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో పనులు చేస్తుండగా భవనానికి పగుళ్లు వచ్చి, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, ప్రమాదాన్ని ముందే ఊహించిన అగ్నిమాపక శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అందులోని కుటుంబాలను ఖాళీ చేయించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.