విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో 'సిద్ధం' పేరుతో
వైసీపీ నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ సభకు వచ్చారు. ఈ సభ నుంచే ఎన్నికల సమర శంఖారావాన్ని సీఎం జగన్ పూరించనున్నారు.
టీడీపీ,
జనసేన కుట్రలను చిత్తు చేసేలా
వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.