మహారాష్ట్ర పాల్హర్ తీరంలో రూ.76వేల కోట్లతో నిర్మించే వాడ్వణ్ పోర్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలన్న మహారాష్ట్ర లక్ష్యానికి తోడ్పాటు అందిస్తుంది. అలాగే ప్రత్యక్షంగా 12 లక్షలు, పరోక్షంగా కోటి మందికి ఉపాధి లభిస్తుంది. ఇది వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతో సైన్యానికి కీలకం అవుతుంది. ఇక్కడి నుంచి మధ్య ఆసియా, ఆఫ్రికా, ఐరోపాకు సరకు రవాణా చేయొచ్చు.