LGBTQ వ్యక్తులు జాయింట్ బ్యాంక్ అకౌంట్లను తెరవొచ్చు: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

57చూసినవారు
LGBTQ వ్యక్తులు జాయింట్ బ్యాంక్ అకౌంట్లను తెరవొచ్చు: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
LGBTQ కమ్యూనిటీ వ్యక్తులు సైతం ఉమ్మడి బ్యాంక్ ఖాతాలను తెరవొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే క్వీర్ రిలేషన్ షిప్ ఉన్న వ్యక్తిని నామినీగా పెట్టుకోవచ్చని పేర్కొంది. దీనిపై ఈనెల 21న ఆర్బీఐ అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు ఆదేశాలిచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ఫారాలు, దరఖాస్తుల్లో 'థర్డ్ జెండర్' కాలమ్ ను చేర్చాలని ఆర్బీఐ 2015లోనే బ్యాంకులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్