అల్పపీడనం ప్రభావంతో ఏపీ అతలాకుతలమవుతోంది. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీఎం చంద్రబాబు సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, జూపూడి ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఆహారం అందజేశారు. దీంతో ఆయనపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.