నేడు 3 జిల్లాల్లో సీఎం పర్యటన

75చూసినవారు
నేడు 3 జిల్లాల్లో సీఎం పర్యటన
AP: సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం పదింటికి వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. వైజాగ్‌లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్