ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో చోరీకి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడి వ్యక్తి మృతి

559చూసినవారు
ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో చోరీకి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ మధురానగర్లో ఓ షాపు ముందున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చోరీకి ప్రయత్నిస్తుండగా డబ్బా మీద పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ రాడ్డు సాయంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోని డోరు తెరిచేందుకు సదరు దొంగ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదే డబ్బా అతడి మీద పడింది. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరగగా ఉదయం చూసేసరికి రక్తపు మడుగులో సదరు వ్యక్తి కనిపించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్