ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోడిపందేలు నిర్వహిస్తే గ్రామంలో శాంతి భద్రతలు తలెత్తే అవకాశముందని కొత్తూరు తాడేపల్లి వాసి మెండెం జమలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.