డబ్బు విషయంలో గొడవ.. తుపాకీతో కాల్చి చంపాడు (వీడియో)

78చూసినవారు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు స్వర్ణకారుల మధ్య డబ్బు లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. ఇద్దరికీ వాగ్వాదం పెరిగి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో ఓ స్వర్ణకారుడు కోపంలో విచక్షణ కోల్పోయాడు. తన వద్దనున్న తుపాకీ బయటకు తీసి తన ప్రత్యర్థిపై కాల్పులు జరిపాడు. దీంతో బాధితుడు సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్