అరకులో చలి పండగకు రూ. కోటి మంజూరు చేస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. ఈ చలి పండగ ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు అరకులో నిర్వహించనున్నారు. చలి పండగతో పాటు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు కూడా పర్యాటక శాఖ రూ. కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.