పుస్తకాలతో కుస్తీ పడాల్సిన విద్యార్థులు వెట్టిచాకిరి చేస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల హాస్టల్‌లో జరిగింది. హాస్టల్ వార్డెన్ చెప్పడంతో దాదాపు 700 చపాతీలు తయారు చేశారు. చపాతీలు చేసేందుకు పని మనుషులు లేరని, అందుకే విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్నట్లు హాస్టల్ వార్డెన్ చెప్పడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తమ సమస్యలు తీర్చాలని విద్యార్థులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.