మన్మోహన్‌సింగ్ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలియజేశారు.‘‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా’’. అని అమిత్ షా ట్వీట్ చేశారు.