AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉండగా.. ఇప్పటివరకూ 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయింది. తనిఖీలు పూర్తయిన తర్వాత అనర్హులకు వేటు తప్పదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 15 వరకు పింఛన్ల వెరిఫికేషన్ పూర్తవుతుందని, తనఖీలు ఎంతో పారదర్శకంగా జరుగుతోందన్నారు. అనర్హులను గుర్తించి వారి పింఛన్లు కట్ చేస్తామన్నారు.