AP: రాష్ట్ర ప్రజలకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించి టెండర్ పిలువబోతున్నారు. ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు పిలుస్తారు. ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరిస్తుంది. ఇప్పుడున్న రూ.25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి.