పిల్లలపై రాజకీయాలు చేయొద్దు : మంత్రి అనిత

64చూసినవారు
పిల్లలపై రాజకీయాలు చేయొద్దు : మంత్రి అనిత
AP: విశాఖ జువైనల్ హోమ్‌లో సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. చిన్న పిల్లలపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరినట్లు కూడా తెలిపారు. అలాగే కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :