అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకునే చర్యలను డొనాల్డ్ ట్రంప్ ఉద్ధృతం చేశారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. సరిహద్దు మూసివేత పనుల కోసం సుమారు 10 వేల మంది సైనికులను పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుంచి తిరిగి వచ్చే వారి కోసం మెక్సికో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.