మావోయిస్ట్ అగ్రనేత చలపతి అంత్యక్రియలు పూర్తి

51చూసినవారు
మావోయిస్ట్ అగ్రనేత చలపతి అంత్యక్రియలు పూర్తి
AP: మావోయిస్ట్ అగ్రనేత చలపతి అంత్యక్రియలు పూర్తయ్యాయి. చలపతి భార్య అరుణ సొంతూరు శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం బొడ్డపాడు. ఆయన మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చి విప్లవ గీతాలు పాడి అంత్యక్రియలు చేశారు. ఛత్తీస్​గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఈ నెల 21న జరిగిన ఎన్ కౌంటర్​లో చలపతి మరణించారు. చంద్రబాబుపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై రూ.కోటి రివార్డు ఉంది.

సంబంధిత పోస్ట్