ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

85చూసినవారు
నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్ సిబ్బందిని వివరాలు అడగగా, పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో సదరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డి ఎమ్ హెచ్ ఓ కు ఫోన్ చేసి ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్