

గోపాలపురం: శ్రీవారి సన్నిధిలో పోస్టర్లు ఆవిష్కరణ
పిఠాపురంలో జరిగే సభను జనసైనికులందరు భారీగా విజయవంతం చెయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ద్వారకాతిరుమల స్వామిని బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారి ఆవరణలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. జనసైనికులు సభకు తరలి వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిఒక్కరు పాల్గొనాలని కోరారు.