మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. దీంతో సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.