పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్
సీతానగరం మండలం రఘుదేవపురంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి పేక ముక్కలు, రూ. 8,350 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. సీతానగరం పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.