
అమలాపురంలో 13న కోనసీమ కవితోత్సవం
అమలాపురంలో అంబేడ్కర్ కోనసీమ కవితోత్సవం పేరిట శ్రీశ్రీ కళావేదిక 147వ జాతీయ శతాధిక కవిసమ్మేళనం జరగనుంది. అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించనున్నట్లు, ఆ సంస్థ అంతర్జాతీయ సీఈఓ కత్తిమండ ప్రతాప్ బుధవారం తెలిపారు. సఖినేటిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కార్యక్రమం అమలాపురం శ్రీకళా గ్రాండ్ వద్ద జరుగుతుందని, 150 మంది కవులు పాల్గొంటారని తెలిపారు.