బీసీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారులతో గురువారం అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురం మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. బీసీ, ఓసీ క్యాటగిరీలో రుణాలకు దరఖాస్తు చేసుకున్న 1400 మంది లబ్ధిదారులకు అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఎండలో జనం ఇబ్బంది పడ్డారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.