అమలాపురం డిపోలో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని యునైటెడ్ వర్కర్స్ యూనియన్, నేషనల్ మజ్దాూర్ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 39వ రోజుకు చేరాయి. ఎన్ఎంయు నాయకుడు పందిరి రాంబాబు మాట్లాడుతూ, అమలాపురం డిపోలో 1/ 19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.