అమలాపురం: పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆదివారం అధికారులు నిర్వహించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.