
కోనసీమ: ఉపాధి హామీ పథకంలో కోనసీమ ఫస్ట్: కలెక్టర్
ఉపాధి హామీ పథకం ద్వారా కోనసీమ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1. 74 లక్షల ఉపాధి వేతన దారులకు పని కల్పించడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం తెలిపారు. 57 లక్షల పనిదినాలు లక్ష్యానికి గాను 56. 80 లక్షల పనిదినాల కల్పించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. రోజువారీ సగటు వేతనం రూ. 291. 20 చెల్లించడం జరిగిందన్నారు. కూలీలకు వేతనాలు కింద రూ. 165. 43 కోట్లు ఖర్చు చేసామన్నారు.