అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పెదగాడవిల్లి- పాశర్లపూడి జట్లు మధ్య హోరా హోరీగా సాగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలు 13వ తేదీ వరకు జరుగుతున్నట్లు టోర్నమెంట్ మేనేజ్ మెంట్ పెయ్యల సాయి తెలిపారు. ఈ టోర్నమెంట్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 40 జట్లు పాల్గొంటున్నాయని వెల్లడించారు.