కార్తీక పౌర్ణమి సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం సాయంత్రం భక్తులు వేలాది సంఖ్యలో గోదావరి తీరంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం గోష్పాద క్షేత్రంలో ఉన్న ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సుందరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణం వెలిగించారు.