ముమ్మిడివరంలో మద్యం షాపులకు 401 దరఖాస్తులు

59చూసినవారు
ముమ్మిడివరంలో మద్యం షాపులకు 401 దరఖాస్తులు
ముమ్మిడివరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 13 మద్యం షాపులు ఏర్పాటు చేసేందుకు గాను గురువారం సాయంత్రానికి 401 దరఖాస్తులు వచ్చాయని ముమ్మడివరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. వివరాల ప్రకారం.. ఐ. పోలవరం మండలంలో 3 షాపులకు గాను 106, కాట్రేనికోన మండలంలో 6 షాపులకు గాను 154, ముమ్మిడివరం నగర పంచాయతీలో 3 షాపులకు గాను 96, ముమ్మిడివరం మండలంలో 1 షాపుకు 45 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్