తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం రౌతులపూడి మండల టిడిపి నాయకులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న వర్తక సంఘాల వారు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్లపూడి మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.