కారును ఢీకొన్న లారీ మహిళకు తీవ్ర గాయాలు..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పార్వతీపురం గ్రామం వద్ద శుక్రవారం కారును ఢీకొన్న ఘటనలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. నరసరావుపేటకు చెందిన పవన్ కుమార్ కుటుంబంతో కారులో గుంటూరు బయలుదేరాడు. పార్వతమ్మగుడి దగ్గర కారు పక్కకు తీసి డోర్ తీయబోయే క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో పవన్ కుమార్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై నాగేంద్ర కేసు నమోదు చేశారు.